కంట్లో పతాకం.. దేశభక్తి అపారం
దేశభక్తి అందరిలోనూ ఉంటుంది. ఆ భక్తిని వ్యక్త పరిచే విధానాలు మాత్రం కొందరిలో భిన్నంగా ఉంటాయి. మనసును జోడించి ఆ భక్తిని ఆవిష్కరిస్తే అది అందరి దృష్టిలో నిలిచి పోతుంది. దానికి కొద్దిగా సాహసం తోడయ్యిందా.. ఎవరైనా ఔరా అనాల్సిందే. ఆశ్చర్యంతో కళ్ళప్పగించాల్సిందే. ఇప్పుడు అదే జరిగింది. అలాంటి సాహసానికే ఒడిగట్టాడు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రాజా. విభిన్న రీతిలో తన దేశ భక్తిని చాటుకునేందుకు అతిపెద్ద సాహసమే చేశాడు. అతి సున్నితమైన తన కనుగుడ్డుపై త్రివర్ణ పతాకాన్ని ముద్రించుకుని అందరి దృష్టిలో పడ్డాడు.
కన్ను అంటేనే అతి సున్నినితమైన అవయవం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చూపుకే ప్రమాదం. అయినా భయపడలేదు. ఓ సూక్ష్మ కళాకారుడిని సంప్రదించాడు. అతని సహాయంతో కను గుడ్డుపై .. తాను అమితంగా ప్రేమించే భారత పతక ముద్రను వేయించుకున్నాడు. కనులకు ఎలాంటి హాని కలగని రంగులతో జాతీయ కేతనాన్ని ముద్రించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మరాయి. ఒకింత సాహసం చేసినా .. ఆయన దేశభక్తికి సెల్యూట్ చేస్తూ.. శభాష్ రాజా అంటున్నారు నెటిజన్లు.