InternationalNationalNews Alert

రియల్ ఎస్టేట్ దూకుడు- జోరుగా NRI ల పెట్టుబడులు

Share with

భారత రియల్ ఎస్టేట్ రంగం వాయువేగంతో దూసుకెళుతోంది. విదేశాలలోని భారతీయులు తమ సొంత ఊర్లలో, సొంతరాష్ట్రాలలో స్థిరాస్థి పెట్టుబడులు పెట్టడానికి ఈ మధ్యకాలంలో ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. స్థిరాస్థిలో పెట్టుబడులు వారికి తిరిగి లాభాలను చేకూరుస్తున్నాయి.

కరోనా సంక్షోభం తరువాత ఎన్నారైల చూపు సొంతగడ్డపై మళ్లిందనే చెప్పాలి. ఎందుకంటే కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్నప్పుడు విదేశాలలోని భారతీయులు తమవాళ్లని చూసుకోవాలని పరితపించారు. రెక్కలు కట్టుకుని వాలిపోయారు. సాఫ్ట్‌వేర్ రంగంలో work from home సౌకర్యం కూడా వారికి కలిసొచ్చింది.

ఇక్కడ నుండే వారి పనులు జరిగిపోవడంతో వారికి అక్కడికి తప్పనిసరిగా వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఇక పాపం ఉద్యోగాలు కోల్పోయి ఇక్కడికి వచ్చినవారు కూడా అధికంగానే ఉన్నారు. ముఖ్యంగా విదేశీయులు ఇక్కడ స్థిరాస్థులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడానికి 4 కారణాలు చెప్పుకోవచ్చు.

వారి కష్టార్జితాన్ని వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముఖ్య కారణం డాలర్‌తో రూపాయి మారకం విలువ. కాబట్టి వారికి ఇక్కడ స్థిరాస్తుల ధరలు అంత ఎక్కువగా అనిపించడం లేదు. ఉదాహరణకి 75 లక్షల ఒక ఫ్లాట్ విలువ వారికి లక్ష డాలర్లకే దొరికినట్లు అవుతుంది. మరొక కారణంగా కరోనా తరువాత భారత ఆర్థిక వ్యవస్థ తరువాత అంతే వేగంగా తిరిగి పుంజుకుంది. Pending up demand కారణంగా ఆస్తుల ధరలను పెంచుతూ పెట్టుబడిదారులకు మంచి లాభాలను సమకూరుస్తోంది.

ఇంతకు పూర్వం విదేశాల నుండి డిపాజిట్లు, బంగారం, ఈక్విటీలు మొదలైన వాటిపై పెట్టుబడులు వచ్చేవి, అయితే అవి మార్కెట్‌లో స్థిరవిలువను కలిగిఉండవు. వడ్డీరేట్లు కూడా తగ్గిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఆదరణ లభించింది. చిన్నతరహా నగరాలలో NRI లకు మంచి పెట్టుబడి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్మార్ట్ సిటీల అభివృద్ది, ప్రభుత్వ విధానాలు కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు.

పైగా విదేశాల నుండి వచ్చే విదేశీమారక ద్రవ్యాన్ని స్వీకరించే దేశాలలో భారత్ ముందుంటుంది. ఎన్నారైలకు INDEXATION సదుపాయాన్ని కూడా కల్పించారు. 24 నెలలకు పైగా ఉన్న ఆస్తిని దీర్ఘకాలిక మూలధన ఆస్తిగా పరిగణిస్తారు. అంతేకాక సెక్షన్ 80C, 80TTA కింద కొన్ని పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి.

ఎన్నారైలు ఆస్థి కొనుగోలు అమ్మకాలు చేసేటప్పుడు నేరుగా అమ్మకందారుల ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి కూడా అనుమతిస్తున్నారు. ఈ విధానాల వల్ల భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశాలలో స్థిరపడిన భారతీయులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు.