NationalNewsNews Alert

కాంగ్రెస్ నేతలకు కరోనా

Share with


కాంగ్రెస్ నేతలు కరోనా బారిన పడుతున్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వధేరాతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ సీనియర్ నేత అభిషేక్‌ మను సింఘ్వీ, పార్టీ సమాచార విభాగం చీఫ్‌ పవన్‌ ఖేరా తదితరులు కరోనా బారినపడిన వారిలో ఉన్నారు. అయితే ప్రయాంకా వధేరాకు కరోనా సోకడం ఇది రెండవసారి. గత సంవత్సరం జూన్ నెలలో అమె మొదటిసారిగా కరోనాతో బాధ పడ్డారు. ఇప్పుడు మళ్ళీ సోకడంతో ఆమె హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్ళారు. ఈ పరిణామాల నేపధ్యంలో రాజస్తాన్ లో పర్యటించాల్సి న రాహుల్ గాంధీ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

Read more: ఢిల్లీలోనూ `తెలుగుదనాన్ని` వీడని వెంకయ్య నాయుడు