ఏపీలో పడిపోయిన సీఎం గ్రాఫ్ !
◆ 20వ స్థానంలో నిలిచిన వైఎస్ జగన్
◆ ఆయన నాయకత్వానికి జై కొట్టిన 39 శాతం మంది ప్రజలు
◆ అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా నవీన్ పట్నాయక్
◆ సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వే ఫలితాలు వెల్లడి
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా మొదటి స్థానంలో ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. ఈ మేరకు సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వే సంస్థ తాజాగా ఫలితాలు వెల్లడించింది. ఆ సంస్థ విడుదల చేసిన ఫలితాల్లో దేశంలో 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గాను 20వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలిచారు. దేశంలో ప్రధాని మోదీ తో పాటు 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రజాదరణ ఎలా ఉందన్న అంశంపై ఆ సంస్థ బృందాలు ఆయా రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా వైఎస్ జగన్ క్రింది నుంచి ఆరో స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. 39% మంది ఆయన నాయకత్వానికి జై కొట్టగా 29 శాతం మంది అసంతృప్తితో ఉన్నారని వారు వెల్లడించారు. మొదటి స్థానంలో నవీన్ పట్నాయక్, రెండవ స్థానంలో యోగి ఆదిత్యనాథ్, నిలిచారని తమ సర్వే ప్రకారం ప్రధాని మోడీకి స్వల్పంగా ప్రజాదరణ పెరిగినట్లు వెల్లడించారు
Read More: అంతంత మాత్రంగా సీఎం కేసీఆర్ ప్రజాదరణ