Breaking NewsHome Page Slider

కేవలం 94 ఓట్ల తేడాతో ఓడిపోయిన డిప్యూటీ సీఎం..

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఈ పార్టీ దారుణంగా ఓటమిపాలైంది. ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ తాజా ఎన్నికల్లో అత్యల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో భూపేష్ బఘేల్ సర్కారుకు గట్టి షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఇక, ఈయనతో పాటు హోంమంత్రి తమ్రాధ్వజ్ సాహు, వ్యవసాయ శాఖ మంత్రి రవీంద్ర చౌబే సహా మొత్తంగా 9 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. కాంకేర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆశారాం నేతమ్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై కేవలం 16 ఓట్ల మెజార్టీతో గెలిచారు.