Home Page SliderInternationalPolitics

ట్రంప్‌కు షాక్ ఇచ్చిన న్యాయస్థానం

ప్రభుత్వ వ్యయాల నియంత్రణ పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ద్వారా అనేక మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే అధ్యక్షుడికి యూఎస్ డిస్ట్రిక్ట్ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. దీనితో తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు.