Home Page SliderTelangana

ప్రజాదర్బార్ క్యూలైన్లలో ఉన్న ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించిన సీఎం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జ్యోతిబాపూలే ప్రజాభవన్ వద్దకు వచ్చిన ప్రజల నుండి అర్జీలను ఆయన స్వీకరించారు. క్యూలైన్లలో ఉన్న ప్రజల నుండి వినతి పత్రాలను సీఎం స్వీకరించి పరిశీలించారు. వారి సమస్యలను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం నుండి ప్రజాదర్బార్‌ను ప్రారంభించనున్నట్లు గురువారం తన ప్రమాణ స్వీకార సమయంలో రేవంత్ ప్రకటించారు. దీంతో నేడు పెద్దసంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ప్రజాభవన్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో ఉన్న వారిని లోపలికి పిలిచారు.