ముఖ్యమంత్రిది మూడు రూపాయల మైండ్‌సెట్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “మూడు రూపాయల మైండ్‌సెట్‌తో మూడు ట్రిలియన్ ఎకానమీ సాధ్యం కాదు” అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనపై ఆయన ప్రసంగంపై దాసోజు శ్రవణ్ తీవ్రంగా మండిపడ్డారు. ఓయూను తనకు కన్నతల్లితో పోల్చుకున్న శ్రవణ్, ముఖ్యమంత్రి ప్రసంగం “విషపూరితంగా, గందరగోళంగా” ఉందని విమర్శించారు.తెలంగాణ ప్రస్తుతం “రైజింగ్ కాదు రావేజింగ్ దశలోకి వెళ్లిందని” ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై ఉన్న ద్వేషంతోనే ముఖ్యమంత్రి ప్రతి వేదికను దుర్వినియోగం చేస్తున్నారని, అలాగే ఫ్యూడల్ మనస్తత్వంతో గురుకులాలను నిర్వీర్యం చేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. అంతేకాక, నల్లమలపై రేవంత్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఉద్యమం గురించి ఆయన మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు . ఎస్సీ వర్గీకరణ, కులగణన, గురుకులాల బలోపేతం వంటి ముఖ్యమైన అంశాలపై సీఎం వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని ఆయన కొట్టిపారేశారు.

