NationalNews

నదిలో పడిన బస్సు… ఆరుగురు జవాన్ల మృతి

జమ్ముకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 39 మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తోన్న ఓ బస్సు నదిలో బోల్తా కొట్టింది.  ఈ ప్రమాదంలో 6గురు సైనికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా వుందని సమాచారం. గాయపడినవారికి ఎయిర్‌ అంబులెన్స్‌ల్లో చికిత్స కోసం అనంత్‌ నాగ్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. భద్రతా సిబ్బంది అమర్‌నాథ్‌ యాత్ర విధులను ముగించుకుని చందన్‌వారీ నుంచి పహల్‌గామ్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బ్రేక్‌ ఫెయిల్‌ అవ్వడంతో బస్సు రోడ్డు మీద నుంచి నదిలో పడిందని ITBP ఉన్నతాధికారులు వెల్లడించారు.