NewsTelangana

కేసీఆర్‌ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు

Share with

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. గవర్నర్‌ ఎట్‌హోం కార్యక్రమానికి సీఎం డుమ్మా కొట్టి సంప్రదాయాలను మంటగలుపుతున్నారని ఆరోపించారు కిషన్‌ రెడ్డి. గవర్నర్‌ పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్‌ పాటించకపోవటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని కిషన్‌ రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను పాతరేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడులు చేయడాన్ని ఖండించారు. నిరాశ, నిస్పృహతో కేసీఆర్‌ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు.