ఎమ్మెల్సీ ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సుకు రోడ్డు ప్రమాదం..
కరీంనగర్ జిల్లా – గంగాధర ఎక్స్ రోడ్డు వద్ద ఎమ్మెల్సీ ఎలక్షన్ బాక్సులు తీసుకువెళ్తున్న ఎలక్షన్ సిబ్బందికి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మల్ నుంచి పోలింగ్ సామగ్రి తీసుకువచ్చి తిరిగి వెళ్తుండగా ముందు వెళ్తున్న బస్సును వెనక నుండి ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన వారికి చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

