బీజేపీలో చేరిన వెంటనే నాపై బ్యాన్ ఎత్తేస్తారు..
రెజ్లర్ బజరంగ్ పునియా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ తనపై విధించిన బ్యాన్ పై ప్రభుత్వం తీసుకున్న ప్రతీకార చర్య అని, తాను బీజేపీలో చేరితే బ్యాన్ ఎత్తేస్తారని పునియా పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 10న జరిగిన జాతీయ జట్టు ఎంపిక ట్రయల్స్ డోప్ పరీక్ష కోస శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించడంతో పునియాను నాలుగేళ్ళ పాటు నాడా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పునియాను నాడా మొదట ఏప్రిల్ 23న సస్పెండ్ చేయగా.. స్పోర్ట్స్ వరల్డ్ బాడీ, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కూడా సస్పెన్షన్ విధించింది.

