అదిగో వంతెన.. ఇదిగో తవ్వకాలు!
ఎన్‌హెచ్-16 రహదారి పరిధిలోని విజయవాడ కనకదుర్గ వారధి, పక్కనే ఉన్న రైలు వంతెనల మధ్య ఇసుకను జేసీబీలతో ఇష్టాను రీతిగా తవ్వేస్తున్నారు.
ఎన్‌హెచ్-16 రహదారి పరిధిలోని విజయవాడ కనకదుర్గ వారధి, పక్కనే ఉన్న రైలు వంతెనల మధ్య ఇసుకను జేసీబీలతో ఇష్టాను రీతిగా తవ్వేస్తున్నారు. జాతీయ రహదారి, వంతెనల మధ్యనే కృష్ణా నదిలో ఇసుకను తవ్వి.. నది రక్షణ గోడ పనులకు, గోడ పక్కనున్న ఖాళీని పూరించడానికి తీసుకెళ్తున్నారు. జాతీయ రహదారులు, జాతీయ రైలు మార్గాలున్న వంతెనల సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టరాదనే నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రక్షణ గోడల పనులకు దూరం నుంచి ఇసుకను తేకుండా నది పక్కనే లోతుగా, పరిమితికి మించి తవ్వుతుండడంతో వంతెనల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

