Home Page SliderNational

‘కాంతార- 2’లో ఆ స్టార్ హీరో..

కాంతార -2 చిత్రంపై కీలక అప్‌డేట్స్ విడుదల చేశారు ‘కాంతార 2’ మేకర్స్. ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో రిషబ్‌షెట్టి తండ్రి పాత్రలో ఒక స్టార్ హీరో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ పాత్రకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒప్పుకున్నారట. కాంతార చిత్రంలో అసలు స్టోరీ గతంలోనే ఉంటుందని, అందుకే ఈ చిత్రంలో హీరో మోహన్ లాల్ పాత్ర చాలా కీలకమైందని పేర్కొన్నారు రిషబ్ షెట్టి. ప్రీప్రొడక్షన్ వర్క్‌ కోసమే చాలా సమయం తీసుకున్నారు మేకర్స్. ఈ మధ్యనే 2024 సమ్మర్‌లో షూటింగ్ ప్రారంభమయ్యింది ఈ చిత్రం. భూతకోల డాన్స్ నేపథ్యంలో 2022లో వచ్చిన కాంతార కన్నడ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించింది. అందరి దృష్టిని ఆకర్షించింది. చిన్న చిత్రంగా వచ్చి పెద్ద హిట్ సాధించింది. దర్శకుడు రిషబ్ షెట్టి హీరోగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. దీనితో దాదాపు రూ.150 కోట్లతో ఈ చిత్రం ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేశారు. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. అయితే రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు.