Andhra PradeshHome Page Slider

“మీ ఆదరాభిమానాలకు..థాంక్యూ పులివెందుల”:చంద్రబాబు

ఏపీలో వచ్చే ఏడాది ప్రారంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని అధికార ,ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు వ్యూహా ప్రతివ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నాయి. దీనిలో భాగంగానే  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అయితే చంద్రబాబు తాజాగా పులివెందులలో రోడ్ షో నిర్వహించారు. కాగా ఈ రోడ్ షోలో తెలుగు తమ్ముళ్లు వేలాదిగా పాల్గొని విజయవంతం చేశారు. దీంతో చంద్రబాబు అక్కడి ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. ఏపీ రాష్ట్రంలో రాజకీయం మారుతోంది.ప్రభుత్వ వ్యతిరేక నిరసనలా మొదలై..ఉద్యమమై ఉప్పెనలా వైసీపీని ముంచెత్తబోతోంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే నిన్నటి నా పులివెందుల సభ. మీ ఆదరాభిమానాలకు..థాంక్యూ పులివెందుల అని ట్వీట్ చేశారు.