తాటి చెట్టుపై ‘థ్యాంక్యూ కేసీఆర్’ – వినూత్నరీతిలో గీత కార్మికుల కృతజ్ఞత
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలుపుకున్నారు కల్లుగీత కార్మికులు. రైతు బీమాలాగానే గీత కార్మికులకు కూడా బీమా సౌకర్యం కలుగజేస్తామని కేసీఆర్ ఈ మధ్యనే ప్రకటించారు. దీనితో గీత కార్మికులు సంతోషంతో తమ ఆనందాన్ని ఇలా తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరులో జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి నేతృత్వంలో కొందరు గీత కార్మికులు తాటిచెట్టుపై వరుసగా నిలబడి, THANKS KCR అనే ఆంగ్ల అక్షరాల ఫ్లకార్డులను చేతపట్టుకుని చూపించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి.

