వరద నీటిలో తలైవా ఇల్లు
తమిళనాడు రాజధాని చెన్నై లో భారీ వర్షాలతో వీధులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నై, పలు జిల్లాల్లో రోడ్డుపై నీరు చేరి ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాలలో జనజీవనం అతలాకుతలం అయింది. అయితే వర్షం ఎఫెక్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తగిలింది. చెన్నైలోని ఆయన ఇంటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో రజినీకాంత్ ఇంటి ఆవరణ పూర్తిగా నీటితో నిండిపోయినట్టు కనిపిస్తోంది.

