రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఠాక్రే
ఇటీవల రాహుల్ గాంధీ తాను చేసిన వ్యాఖ్యల కారణంగా ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొంటున్నారు. కాగా ఇటీవల ఆయనపై అనర్హత వేటు పడినప్పుడు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు మరో వివాదానికి దారీతీశాయి. రాహుల్ ఆ సందర్భంలో మీడియాతో మట్లాడుతూ “క్షమాపణలు చెప్పడానికి నేను సావర్కర్‌ని కాదు గాంధీని” అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ఖండించారు. ఠాక్రే మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మీతో చేతులు కలిపామన్నారు. కానీ మా దేవుడిని అవమానిస్తే మాత్రం ప్రతిపక్ష కూటమి చీలీపోయే అవకాశం ఉందని ఠాక్రే రాహుల్‌ను హెచ్చరించారు. మిమ్మల్ని రెచ్చగొడుతుంది BJPయే అని మీరు గర్తుంచుకోవాలన్నారు. ఇటువంటి సమయంలో అప్రమత్తంగా ఉండకపోతే మన దేశం పూర్తిగా నియంత పాలనలోకి వెళ్లిపోవడం ఖాయమని ఠాక్రే స్పష్టం చేశారు.

