NewsTelangana

ట్రిపుల్‌ ఐటీలో కలకలం.. విద్యార్థి సూసైడ్‌

బాసర ట్రిపుల్‌ ఐటీ మళ్లీ వార్తల్లోకెక్కింది. మళ్లీ ట్రిపుల్‌ ఐటీలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హాస్టల్‌ గదిలో ఇంజినీరింగ్‌ ఫస్టియర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సూసైడ్‌ చేసుకున్న విద్యార్థి నిజామాబాద్‌ జిల్లాగా గుర్తించారు. విద్యార్థి చనిపోయినా కాలేజీ ఇంఛార్జి వీసీ, డైరెక్టర్‌ కనీసం పట్టించుకోవడం లేదని, విద్యార్థి మృతి వివరాలపై ఆరా తీయలేదని తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌ను కానీ, వైద్యాధికారులను కానీ పిలిపించలేదని విద్యార్థులు మండిపడ్డారు. అధికారుల తీరుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వీసీ చాంబర్‌ మట్టడికి యత్నించారు. పక్కనే ఉన్న సీఐ వాహనంపై విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిలో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి.