సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత… బీజేపీ, టీఆర్ఎస్ బాహాబాహీ…
బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజాసంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనగామ జిల్లా దేవరుప్పలలో సంజయ్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయ్. అయితే అదే సమయంలో సంజయ్ మాట్లాడుతున్న సమయంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
పాలకుర్తిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని… కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వలేదని ఆరోపించగా… టీఆర్ఎస్ నేతలు, బీజేపీపై ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు. బీజేపీ ఎంత మందికి ఉద్యోగాలిచ్చిందని ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.