ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత.. డీవైఎఫ్‌ఐ నేతలు అరెస్ట్
ప్రగతి భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. కానిస్టేబుల్, ఎస్సై నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ డీవైఎఫ్‌ఐ ఆరోపించింది. నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నిరసన దిగిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక, 1600/800 మీటర్లు రన్నింగ్ పాసైన అభ్యర్థులందరికీ మెయిన్ ఎగ్జామ్‌కు అవకాశం కల్పించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 7 మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతున్నారు.


