నాగార్జున యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత
గుంటూరులోని నాగార్జున యీనివర్శిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఈ రోజు నాగార్జున యూనివర్శిటీలో మూడు రాజధానులకు అనుకూలంగా యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి వ్యతిరేకంగా రాజధాని రైతులు అక్కడికి చేరుకున్నారు. యూనివర్శిటీకి వచ్చిన రాజధాని రైతులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.దీంతో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది,రాజధాని రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో రాజధాని రైతులంతా 3 రాజధానులను సమర్థించే వీసీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులంతా వీసీ కార్యాలయానికి తాళం వేసి నాగార్జున యూనివర్శిటీ ఎదుట నిరసనకు దిగారు.

