బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వద్ద ఉద్రిక్తత
రాజకీయ అనిశ్చితి, నిరసనలతో రగులుతున్న బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వద్ద నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీఫ్ జస్టిస్‌తో సహా న్యాయమూర్తులంతా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వందలమంది విద్యార్థులు, నిరసనకారులు సుప్రీంకోర్టును చుట్టుముట్టారు. ప్రధాన న్యాయమూర్తి ఓబైదుల్ హసన్, మిగిలిన జడ్జీలు నేడు మధ్యాహ్నం ఒంటి గంట లోపు రాజీనామాలు చేయకపోతే, వారి ఇళ్లను చుట్టుముడతామని బెదిరిస్తున్నారు.

