ఎంత ఎత్తుకు ఎదిగినా చేరుకోవాల్సింది భగవంతుడినే-హరీశ్ రావు
సంగారెడ్డి, కంది గ్రామంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్, రాధాకృష్ణ టెంపుల్‌కి భూమి పూజ చేశారు మంత్రి హరీశ్ రావు. కల్చరల్ సెంటర్ కందిలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి రోజు అక్షయ పాత్ర ఫౌండేషన్ కొన్ని లక్షల మందికి భోజనం అందిస్తుందని అభినందించారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగిన చేరుకోవాల్సింది భగవంతుడినేనంటూ వేదాంతం మాట్లాడారు. ఎంత సంపాదించిన, ఏం చేసిన చివరికి భగవంతుడికే సొంతమవుతాయన్నారు. మానవులు కేవలం నిమిత్త మాత్రులేనన్నారు. ఏ చట్టాలు, పోలీసులు, ప్రభుత్వాలు చేయలేని పని భగవంతుడు చేస్తాడన్నారు. మనల్ని మంచి మార్గంలో నడిపే శక్తి భగవంతుడికే ఉందన్నారు హరీశ్ రావు. కల్చరల్ సెంటర్‌కు వ్యక్తిగతంగా సహాయం చేసే అవకాశం ఇవ్వాలని నిర్వాహకులను మంత్రి కోరారు.