ఫ్యామిలీ హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోండన్న నటుడు సుమన్
సినిమా షూటింగ్‌ల బంద్ చేయడం సరైన నిర్ణయం కాదన్నారు నటుడు సుమన్. బంద్‌తో ఓటీటీలకు వాటిల్లే నష్టం ఏమీ లేదన్నారు. మంచి కంటెంట్‌తో సినిమాలు వస్తే జనం థియేటర్లకు వచ్చి ఆదరిస్తున్నారన్నారు. ఓటీటీలో విడుదల చేస్తున్న సినిమాల సెన్సార్‌పై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు సుమన్. హీరోల రెన్యుమరేషన్‌పై వివాదం అనవసరమన్న ఆయన… రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలనడం సమంజసం కాదన్నారు. ఇండస్ట్రీలో ఫ్యామిలీల గురించి చెప్పేవాళ్లు… వాళ్ల హీరోల రెమ్యూనరేషన్ తగ్గించకోమని అడగాలన్నారు. హీరోలకు ఉన్న ఆదరణ బట్టి రెమ్యూనరేషన్ ఇస్తారన్నారు. షూటింగ్‌ల సమయాన్ని ప్రొడ్యూసర్లు పెంచుకోవాలని… అవసరం మేరకే కాల్షీట్లు తీసుకుంటే మంచిదన్నారు. బయ్యర్లకు నష్టం లేకుండా చూడాలని… అప్పుడే ఇండస్ట్రీ వర్ధిల్లుతుందన్నారు.