Home Page SliderTelangana

కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణా పదిలంగా ఉంటుంది: మంత్రి హరీష్‌రావు

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చల్మెడ వద్ద చేపట్టిన ప్రాజెక్టుకు తెలంగాణా ప్రభుత్వం రూ.2,653 కోట్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ   ఈ సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి మంత్రి హరీశ్‌రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణా సీఎం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే బాగుంటుందన్నారు. ఇతరుల చేతుల్లోకి వెళితే ఆగమవుతుందని మంత్రి హరీష్‌రావు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తయితే సంగారెడ్డి సస్యశ్యామలం అవుతుందన్నారు. తెలంగాణా రైతుల దగ్గర ఉన్న  ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో పేదలు,రైతుల కోసమే తెలంగాణా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కాగా ఈ సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా సంగారెడ్డి,ఆందోళ్,జహీరాబాద్ నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు లబ్ది చేకూరుతుందన్నారు. అయితే ఈ ప్రాజెక్టు కోసం 12 టీఎంసీల నీటిని కాళేశ్వరం నుంచి కేటాయించామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.