తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 అద్భుతం
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల ఎదుర్కొన్న సంక్షోభ పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయని, కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ఎక్స్ వేదికగా ఒక వీడియో సందేశం ద్వారా మంగళవారం వెల్లడించారు. ఇండిగో ఎదుర్కొన్న అతిపెద్ద కార్యనిర్వాహక వైఫల్యం కారణంగా ప్రయాణికులను తీవ్రంగా నిరాశపరిచినందుకు ఆయన క్షమాపణ చెప్పారు. లక్షలాది మంది వినియోగదారులు వారి రీఫండ్‌లను ఇప్పటికే పొందారని, ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు. విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన లగేజీని సైతం ప్రయాణికుల ఇంటివద్దకు చేర్చామని, నిన్నటి నుంచి వందకుపైగా గమ్యస్థానాలకు సర్వీసులు ప్రారంభమయ్యాయని ఆయన వివరించారు. ఈ సమస్యకు గల అసలు కారణాలను గుర్తించడంపై ఇప్పటికే దృష్టిపెట్టామని, ప్రభుత్వానికి తమ సహకారాన్ని అందిస్తున్నామని సీఈఓ పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు.

