Breaking Newshome page sliderHome Page SliderTelangana

తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

ఆరు దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిందన్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు పేర్కొన్నారు . 2009లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన డిసెంబర్ 9వ తేదీని పురస్కరించుకుని, సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్‌ సిటీ వేదికగా రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో రూ. 5.8 కోట్లతో, 18 అడుగుల ఎత్తున ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరు దశాబ్దాల కల నెరవేరినందని , ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం కూడా ఇదే రోజు కావడం తమకు పర్వదినమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో సోనియా, మన్మోహన్ స్ఫూర్తిని కొనసాగిస్తూ, సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.