ఈ నెల 23న కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
ఈ నెల 23న హైదరాబాద్ గాంధీ భవన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనున్నారు. సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జిగా నూతనంగా నియమితులైన మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పీఏసీ, పీఈసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికార ప్రతినిధులు భేటీలో పాల్గొంటారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.

