Home Page SliderTelangana

తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ రెండో సంవత్సరంలో 64.19 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ లో 51.5 శాతం మంది పాసయ్యారు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో 3.22 లక్షల మంది పాసవగా, ప్రథమ సంవత్సరంలో 2.87 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ బోర్డు TS 1వ సంవత్సరం 2024 బోర్డు పరీక్షలను ఫిబ్రవరి 28 నుండి మార్చి 18 వరకు మరియు TS ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలను ఫిబ్రవరి 29 నుండి మార్చి 19 వరకు నిర్వహించింది. అధికారిక ప్రకటన తర్వాత విద్యార్థులు తమ స్కోర్‌లను అధికారిక TSBIE వెబ్‌సైట్ – https://tsbie.cgg.gov.in/, https://results.cgg.gov.in/లో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.