మూసీ ముంపును పట్టించుకోని తెలంగాణా ప్రభుత్వం- కిషన్‌రెడ్డి
ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో భారీవర్షం నమోదు అవుతూ, చెరువులు, నదులు కట్టలు తెగి ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయని… వారి నష్టాన్ని అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని… కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఉదయం భారీ వర్షాలకు జలమయమైన అంబర్‌పేటలోని ముంపు ప్రాంతాలు, మూసారంబాగ్ వంతెనను కిషన్ రెడ్డి పరిశీలించారు. మూసీ నదీ పరివాహక ప్రాంతాలలో అభివృద్ధి చేయడానికి తెలంగాణా ప్రభుత్వం తరపున ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసామనీ, ఛైర్మన్‌ను కూడా నియమించి, కమిటీ మెంబర్స్‌ను ఇచ్చామంటూ బూటకపు మాటలతో జనాలను మభ్యపెడుతొందనీ, మూసీ అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. మూసీ ప్రక్షాళణ పేరుతో కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు చేసారని, ఆనిధులు ఎవరికి చేరాయో ఎవరికీ తెలియదనీ విమర్శించారు. ప్రభుత్వం జాగ్రత్త వహించి ఉంటే ప్రజలకు ఇంత కష్టం వచ్చేది కాదన్నారు. మూసీ పనులపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యపు ధోరణి వహిస్తోందన్నారు.