జ్ఞానభూమిలో ‘పీవీ జయంతి’ వేడుకలు -నివాళులర్పించిన తెలంగాణా ప్రముఖులు
మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు గారి 102వ జయంతి ఈరోజు. ఈసందర్భంగా పలువురు ప్రముఖులు, వారి కుటుంబసభ్యులు నెక్లెస్ రోడ్డులో గల పీవీ జ్ఞానభూమిలో నివాళులర్పించారు. ఆయన కుమార్తె , ఎమ్మెల్సీ వాణిదేవితో పాటు ఇతర కుటుంబీకులు, తెలంగాణా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతీ రాథోడ్, లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంధర్ కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఆయనకు భారత రత్న ఇచ్చుండాలన్నారు. దీనికి బీఆర్‌ఎస్ పాటు పడుతుందని తెలిపారు. ఆయన ఎక్కడికెళ్లినా తెలుగుతనాన్ని ప్రతిబింబించే దుస్తులే వేసుకునేవారని పేర్కొన్నారు. పీవీ అప్పట్లోనే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడారన్నారు ఈటల రాజేందర్. తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న ముద్దు బిడ్డ అని కొనియాడారు ఈటల.

