తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం..భట్టికి కిషన్ రెడ్డి లేఖ
తెలంగాణ బీజేపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపీల సమావేశానికి హాజరు కాకూడదని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లేఖ రాశారు. బీజేపీ ఎంపీలను సమావేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ఎంపీలకు కొందరికి ఆలస్యంగా సమాచారం అందిందని, వారికి నియోజకవర్గాలలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని, వాటివల్ల రాలేకపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. శనివారం నిర్వహించబోయే రాష్ట్ర ఎంపీల సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి స్వయంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను ఫోన్ చేసి ఆహ్వానించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్న అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. అయితే బీజేపీ ఎంపీలు హాజరుకాకపోవడంతో కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే భేటీ అయ్యే అవకాశం ఉంది.

