బీజేపీలో సంస్థాగత మార్పులు… పంజాబ్, చండీగఢ్‌కు మంత్రి శ్రీనివాస్
బీజేపీ హైకమాండ్ సంస్థాగత మార్పులు చేపట్టింది. తెలంగాణ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మంత్రి శ్రీనివాసులును బీజేపీ జాతీయ నాయకత్వం పంజాబ్, చండీగఢ్‌కు బదిలీ చేసింది. నాలుగు రాష్ట్రాలకు ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీలను మారుస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా అజయ్ జంబ్వాల్, కర్ణాటక ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజీవ్ దివి, పశ్చిమ బెంగాల్ జాయింట్ సెక్రటరీగా సతీష్ దొందను నియమించారు. తెలంగాణకు చెందిన మంత్రి శ్రీనివాసులును పంజాబ్, చండీగఢ్‌కు.. నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.