NewsTelangana

కేసీఆర్‌ను ఇకపై ప్రజలు నమ్మరంటున్న..షర్మిల

Share with

కేసీఆర్ అరాచక పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పించడమే మా పార్టీ  లక్ష్యం అంటున్నారు వైటీఆర్ పార్టీ అధ్యక్ష్యురాలు షర్మిల.ఈ మేరకు గోదావరి పరివాహక ప్రాంతాలలో ఆమె పర్యటించారు.ధర్మపురిలో వరద బాధితులను పరామర్శించి..తెలంగాణాలో రాబోయేది వైఎస్ఆర్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు.రాష్ట్రంలోని ఆడబిడ్డల చేత కేసీఆర్ కన్నీళ్ళు పెట్టిస్తున్నారని ..ఆ పాపం ఊరికే పోదన్నారు.కేసీఆర్ ప్రజలలో విశ్వాసం కోల్పోయారని షర్మిల ఆరోపించారు.ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవాలన్నారు.అదే విధంగా వరద కారణంగా నివాసాలు కోల్పోయిన వారికి వెంటనే డబుల్ బెడ్‌రూం ఇళ్ళు మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.వరద బాధితులను చూస్తుంటే చాలా బాధగా ఉందని..ఆవేదన వ్యక్తం చేశారు.వరదలతో సర్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉండాల్సిన సమయం ఇది అని గుర్తు చేశారు.తెలంగాణ ప్రజలు వైఎస్ఆర్ పాలనలోనే సుఖంగా ఉన్నారని..రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెచ్చేవరకు తన పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు.అందుకే ఆయన బాటలో పయనిస్తూ ప్రజల  సమస్యలు తెలుసుకోవాలనే పాదయాత్ర చేస్తున్నానన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు వైటీపీ మంత్రులు పాల్గొన్నారు.