టెక్నాలజీ రాజీవ్ గాంధీ చలవే..
భారత్‌లో నేడు మనం చూస్తున్న టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీనే అని కొనియాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పంజాగుట్టలోని రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని విప్లవాత్మక మార్పులకు రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారన్నారు. పంచాయితీ రాజ్ వ్యవస్థలు కూడా ఆయన హయాంలోనే బలోపేతం అయ్యాయన్నారు. సచివాలయం ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తానని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అధికారం పోయినా అహంకారం పోలేదన్నారు. అతి వ్యాఖ్యలు చేస్తే వారిని తెలంగాణ ప్రజలే బహిష్కరిస్తారని హెచ్చరించారు. త్వరలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

