Home Page SliderTelangana

ఉల్లి కొనాలంటే కన్నీళ్లే

వంటలలో తరచూ వాడే ఉల్లిపాయ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి కొనాలంటే సామాన్యులు కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. వర్షాల కారణంగా ఉల్లి హైదరాబాద్‌లో రూ.60 నుండి రూ.80 వరకూ పలుకుతోంది. మహారాష్ట్ర, కర్నూల్ నుండి రావలసిన ఉల్లి కూడా దిగుబడి తగ్గడం కారణంగా భారీగా ధరలు పెంచుతున్నారు. మరో రెండు నెలల పాటు రేట్లు తగ్గేదే లేదంటున్నారు. మరో 15 రోజులలో భారీగా ధరలు పెరగవచ్చని పేర్కొంటున్నారు. కేంద్రప్రభుత్వం ఇప్పటినుండే ఉల్లి ధరలను కంట్రోల్ చేసే చర్యలు చేపడుతోంది. 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్‌ను విడుదల చేస్తోంది కేంద్రం. రాయితీపై ఉల్లిని రిటైల్‌గా అమ్మాలనే ఆలోచన చేస్తోంది. అలా చేస్తే రానున్న రోజుల్లో ఉల్లి ధరలు కొంత తగ్గే అవకాశం ఉంది.