సూపర్ 8కు టీమిండియా సిద్ధం
టీ 20 ప్రపంచకప్ పోటీలో సూపర్ 8కు టీమిండియా సిద్ధమయ్యింది. లీగ్ దశను దాటి సూపర్ 8 కు చేరుకున్న అఫ్గానిస్థాన్‌తో తన తొలిమ్యాచ్‌ను ఆడబోతోంది. లీగ్‌లో 4లో 3 మ్యాచ్‌ల్లో గెలుపొందిన భారత్ సూపర్ 8లోనూ దూసుకుపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. లీగ్ మ్యాచ్‌లలో రాణించిన పంత్, సూర్య, హార్దిక్, బుమ్రా, అర్షదీప్‌లు తమ ఫామ్‌ను కొనసాగించాలని కోరుతున్నారు. స్టార్ బ్యాట్స్‌మెన్స్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలు బాగా ఫామ్‌లోకి రావలసి ఉంది. ఈ దశలో వీరు బాగా ఆడి భారత్‌ను ఫైనల్స్‌కు చేర్చాలని అభిమానులు సోషల్ మీడియాలలో పోస్టులు పెడుతున్నారు.


 
							 
							