Home Page SliderNational

ఆస్ట్రేలియా రెండో టెస్టులో విజయం దిశగా టీమ్ ఇండియా

ఇండియా-ఆస్ట్రేలియా 2వ టెస్ట్ 3వ రోజు ఆటలో టీమ్ ఇండియా పై చేయి సాధిస్తోంది. మ్యాచ్ గెలవడానికి స్వల్ప లక్ష్యంతో భారత్ జట్టు బరిలోకి దిగింది. ఆస్ట్రేలియాపై 115 పరుగుల ఛేజింగ్‌లో KL రాహుల్, రోహిత్ శర్మల వికెట్లను భారత్ జట్టు కోల్పోయింది. ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు రవీంద్ర జడేజా ఏడు వికెట్లు పడగొట్టగా, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్య ఆస్ట్రేలియాను 113 పరుగులకే భారత్ కట్టడి చేసింది. ఆదివారం 1 వికెట్‌కు 61 పరుగుల స్కోరు వద్ద తిరిగి ప్రారంభించిన ఆస్ట్రేలియా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కలిసి విధ్వంసం సృష్టించడంతో టకటకా వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఒక పరుగు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన నేపథ్యంలో భారత్‌కు 115 పరుగుల విజయలక్ష్యం లభించింది. ప్రస్తుతం భారత్ జట్టు 59 పరుగులకు రెండు వికెట్ల వద్ద ఉంది. విజయానికి మరో 56 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ చేతిలో ఎనిమిది వికెట్లున్నాయి.