తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య ఉమ్మడి మ్యానిఫెస్టో పై కసరత్తులు
ఏపీలో రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు ఇరు పార్టీ నాయకులు వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించామని త్వరలోనే ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వారాహి యాత్రలో భాగంగా నాలుగవ రోజు బుధవారం పెడనలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ పోవాలనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్తామని చెప్పారు. ఒక ప్రజా కంఠకుడు మనల్ని హింసిస్తుంటే అందరం కలిసి పోరాటం చేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

రాష్ట్రంలో చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని సభ పెట్టాలంటే ప్రత్యేక అనుమతులు రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే వీసా తీసుకునే పరిస్థితి నెలకొన్నదని అన్నారు. ఈసారి వైఎస్ఆర్సిపి వ్యతిరేక ఓటు చీలకుండ మరోసారి తెలుగుదేశం పార్టీతో కలిసి వస్తున్నామన్నారు. జగన్ దగ్గర పావలా దమ్ము కూడా లేదని కనీసం పార్లమెంటులో గళం కూడా ఎత్తలేదని ఆరోపించారు.


