సర్ సలహా ప్లీజ్ అంటున్న..రణ్‌వీర్ సింగ్
ఒక అవార్డుల ఫంక్షన్‌లో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ అడిగిన ప్రశ్నకు అనవసరంగా ఒత్తిడి తీసుకోవద్దు.. అనవసరంగా బోధన చేయొద్దు అన్నారు టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. అయితే ఈ సలహాను నేటి యువతకు సూచిస్తున్నారు. ముంబయిలో 2022 ఏడాదికి గాను జరిగిన ఐఏఏ లీడర్‌షిప్ అవార్డుల కార్యక్రమంలో ఈ ఘట్టం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఘట్టంలో భాగంగా రణవీర్ సింగ్ పలు సందేహాలు లేవనెత్తగా.. నటరాజన్ తన అనుభవసారాన్ని కాస్త అక్కడ ఉన్న యువతకు పంచారు. ఈ సందర్భంగా వృత్తి-వ్యక్తిగత జీవితంలో సమతుల్యం వంటి జీవిత పాఠాలను ఆయన కాసేపు వెల్లడించారు.
అయితే ఈ కార్యక్రమంలో ముందుగా రణవీర్ సింగ్ పలువురు వ్యాపార దిగ్గజాల నుంచి తనకున్న సందేహాలను అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగా చంద్రశేఖరన్‌తో మాట్లాడుతూ… సమయ పాలనపై సలహా కావాలని కోరారు. ఇందుకు ఆయన సమాధానమిస్తూ అనవసరమైన ఒత్తిడి తీసుకోవద్దు. అనవసరంగా బోధనలు చెయొద్దు అని సమాధానమిచ్చారు. అలాగే వేదిక ఏదైనా రణవీర్ చూపే హుషారును గురించి ఈ సందర్బంగా ఆయన ప్రస్తావించారు. హుషారులో 10 % నాకున్న ..నా జీవితం మరో విధంగా ఉండేదని..అసలు ఇంత హుషారుగా ఉండటం నీకు ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. చంద్రశేఖరన్ వేసిన ఈ ప్రశ్నతో ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగింది. బాలీవుడ్ సినిమాలు కరోనా తర్వాత బాక్సాఫీసు వద్ద అనుకున్న విధంగా విజయం సాధించలేక పోతున్నాయని.. దక్షిణాది సినిమాలను మాత్రం ప్రజలు ఆదరిస్తున్నారు.దీనిపై మీ మాటేంటి సర్ అని అడుగగా సినిమా పరిశ్రమపై నాకున్న జ్ఙానం శూన్యం. ఏదన్నా అభిప్రాయం ఉన్నా అది కూడా కాస్త ప్రతికూలంగానే ఉంటుందని సమాధానమిచ్చారు.