మూసారాంబాగ్ బ్రిడ్జిని ముంచెత్తిన వరద
కొద్ది రోజులుగా రాజధాని నగరమైన హైదరాబాద్‌లో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద పోటెత్తింది. దీనితో జీహెచ్‌ఎంసీ , నగర ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమత్తమయ్యారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మూసారాంబాగ్ , చాదర్‌ఘాట్ వంతెనలపై రవాణా నిలిపివేశారు. వంతెనకి ఇరవైపులా బారికేట్లు ఏర్పాటు చేశారు. ఎప్పుడూ బీజీగా ఉండె మూసారాంబాగ్ వంతెన మూసివేయడంతో అంబర్‌పేట్ , మలక్‌పేట్ , మూసారాంబాగ్ , కాచిగూడా మధ్య రాకపోకలను నిలిపి వేశారు . ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు వాహనాలను అంబర్‌పేట కొత్త వంతెన వైపు మళ్లించారు.
స్కూల్స్ , కాలేజీలు , ఆఫీసులు , ఇతర పనులకు వెళ్లెవారు ఓక్క సారిగా అంబర్‌పేట కొత్త బ్రిడ్జిపైకి చేరడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూసానగర్ , కమలానగర్ పరిసర ప్రాంతాలను మూసీ వరద నీరు ముంచేత్తింది. ఈ పరిస్ధితిపై అప్రమత్తం అయిన అధికారులు అంబర్‌పేట , మలక్‌పేట పరిసరాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రలకు తరలించారు. ఉస్మాన్‌సాగర్‌కు 8వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో.. జలాసయ అధికారులు 13 గేట్లను ఎత్తారు. వరద ఉధృతి తక్కువగా ఉన్న రత్ననగర్ , గోల్నాకల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 2 వేలకి పైగా ప్రజలను తరలించినట్టు సమాచారం.