Andhra Pradesh

విద్యా హక్కు చట్టాన్ని సవరిస్తూ..ఏపీ ప్రభుత్వం గెజిట్‌ విడుదల

Share with

పేద విద్యార్ధులకు ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్లలో 25 శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించేలా చర్యలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.విద్యా హక్కు చట్టాన్ని సవరిస్తూ.. ఏపీ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. తద్వారా వీటిల్లో ఏటా లక్ష సీట్లు పేద విద్యార్ధులకు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు అడ్మిషన్ల కోసం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. లాటరీ విధానంలో సీట్ల కేటాయింపు ఉంటుందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు విద్యార్ధుల్ని బడులకు రప్పించేందుకు అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాల్ని అమలుచేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే వాటిని ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేటులోనూ అమలు చేస్తోంది. ఇప్పుడు పేద విద్యార్ధులకు ప్రైవేటు స్కూళ్లలో సీట్లను కూడా రిజర్వ్ చేయడం ద్వారా నాణ్యమైన విద్య అందే అవకాశం లభిస్తుంది.