నందమూరి తారక రత్న మృతి
టాలీవుడ్ నటుడు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడు నందమూరి తారక రత్న కన్నుమూశారు. లోకేష్ పాదయాత్ర లో పాల్గొనేందుకు కుప్పం వచ్చిన తారక రత్న… మాసివ్ హర్ట్ స్ట్రోక్ కు గురయ్యారు. 23 రోజులుగా చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయారు. దేశంలోని వైద్యులతో పాటుగా, విదేశాల నుంచి వైద్యులను రప్పించిన తారక రత్న ప్రాణాలు కాపడలేకపోయారు.

