ఆఫ్ఘనిస్తాన్ అంటే చులకనా… షరీఫ్ క్షమాపణ చెప్పు…
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ చేసిన ప్రసంగంపై తాలిబాన్ మండిపడింది. షరీఫ్ వ్యాఖ్యలతో ఆఫ్ఘనిస్తాన్‌కు తీరని అవమానం కలిగించిందంటూ ఆ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. తాలిబాన్ పాలనలో ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామంగా మారిందంటూ ఐక్యరాజ్యసమితిలో షరీఫ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తాలిబాన్లు డిమాండ్ చేశారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటనను తిరస్కరిస్తున్నామన్న తాలిబన్… ఆ ప్రకటన అసమంజసమైనది, అవమానకరమైనది పేర్కొంది. పాకిస్థాన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తాలిబాన్‌కు ఉన్నత వర్గాలు అభిప్రాయపడ్డాయి.

శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ షరీఫ్ అనేక అంశాలను ప్రస్తావిస్తూ.. ఆప్ఘనిస్తాన్ తీరును ఖండించారు. ఆఫ్ఘనిస్తాన్‌ను ఒంటరి చేయొద్దంటూనే… విమర్శలు చేయడంపై ఆ దేశం కస్సుమంది. తాలిబాన్ అధికారాన్ని చేపట్టి ఏడాదైనా… నేటికీ ఆ ప్రభుత్వాన్ని ఒక్క దేశం కూడా గుర్తించలేదు. షరీఫ్ ప్రసంగంలో ప్రాంతీయ అస్థిరత, తీవ్రవాదం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. పాకిస్తాన్ తీవ్రవాదానికి బలైందన్నారు. ఇస్లామాబాద్, తాలిబాన్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, సరిహద్దు సమస్యలపై ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌లోని లక్ష్యాలను యుఎస్ డ్రోన్‌ల ద్వారా పాక్ అతి చేస్తోందని ఆప్ఘనిస్తాని విరుచుకుపడోంది. సెప్టెంబరు 14న, ఆఫ్ఘన్-పాకిస్థాన్ సరిహద్దులో సైనికుల మధ్య కాల్పుల్లో అనేకమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
