సినీ నటి టబు కంటికి తప్పిన ప్రమాదం..
ప్రముఖ సీనియర్ హీరోయిన్ టబు షూటింగ్‌లో గాయపడ్డారు. టబు , అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ క్రమంలోనే ఓ కీలక సన్నివేశంలో భాగంగా ట్రక్కును బైక్స్‌తో ఛేజ్ చేసే సీన్స్‌లో ఆమె కంటికి గాయమయ్యిందని చిత్ర బృందం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ట్రక్కు అద్దాలు పగిలి ఆమె నుదిటికి , కంటికి గుచ్చుకున్నట్టు సమాచారం.

దీంతో చిత్ర బృందం హుటహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా , ఎటువంటి ప్రమాదం లేదని తెలిసి మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ప్రమాదంపై స్పందించిన అజయ్ షూటింగ్‌కు చిన్న విరామం ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది.