NewsTelangana

నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

Share with

తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురు జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. న్యాయమూర్తులుగా ఏనుగుల వెంకట వేణోగోపాల్‌, నగేష్‌ భీమపాక, పుల్లా కార్తీక్‌, కాజా శరత్‌, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావు ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. కొత్త న్యాయమూర్తులకు సీజే ఉజ్జల్‌ భూయాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు ఏర్పాటైనప్పటి నుంచి జడ్జీ సంఖ్య 24 ఉండగా… ఆ సంఖ్యను 42కు పెంచుతూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటిదాకా తెలంగాణ హైకోర్టులో 28 మంది జడ్జీలు ఉండగా ఇవాళ ఆరుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. మరో 8 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.