ఈటలపై సర్కారు ప్రతీకారం
ఈ రోజు తెలంగాణాలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అధికార,ప్రతిపక్షాలు మధ్య మాటల యుద్దం మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సెషన్ మొత్తానికి స్పీకర్ ఈటలపై సస్పెన్షన్ విధించారు. ఈటల స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలే సస్పెన్షన్‌కు ప్రధాన కారణం అని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఈటల ఒక వారం క్రితమే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని కోరినా చెప్పలేదన్నారు. ఒక గౌరవమైన పదవిలో ఉండి స్పీకర్‌ను మరమనిషి అని సంబోధించడం చాలా బాధాకరమని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అయితే ఇప్పటివరకు క్షమాపణ చెప్పనందుకు గాను ఈటలను సస్పెండ్ చేయాలని నిర్ణయించామన్నా రు.

