NewsNews AlertTelangana

తెలంగాణ రాజకీయాలకు సర్వే కిక్

Share with

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పతనమవుతోంది. ఇటీవల వస్తున్న సర్వేలన్నీ కూడా ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీ చతికిలపడుతోందని తేల్చి చెబుతున్నాయ్. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హ్యాండ్సప్ అంటుంటే… తెలంగాణలో ఆ పార్టీ మరింత దిగజారుతున్నట్టుగా కన్పిస్తోంది. తాజాగా వచ్చిన ఇండియా టీవీ సర్వేలో ఆ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేవలం రెండు స్థానాలే వస్తాయని సర్వే తేల్చింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మూడు లోక్ సభ స్థానాలు దక్కాయ్. ఇక టీఆర్ఎస్ పార్టీ సైతం రోజు రోజుకు క్షీణిస్తోందని సర్వే స్పష్టం చేసింది. తాజాగా ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీ 9 నుంచి 8కి తగ్గుతోందని పేర్కొంది. అంతే సమయంలో బీజేపీ 4 స్థానాల నుంచి 6కు ఎగబాకుతోందంది. ఇక ఓట్ల శాతం చూస్తే… టీఆర్ఎస్ ఓట్ షేర్… 42 శాతం నుంచి 34 శాతానికి తగ్గుతుందని… బీజేపీ ఓట్ షేర్ 20 నుంచి 39 శాతానికి పెరుగుతుందని… కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ 30 నుంచి 14 శాతానికి పడిపోతుందని సర్వే చెప్పింది. మజ్లిస్ ఒక్క ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకుంటుదని వివరించింది.