ఏపీలో మళ్లీ జగనే… ఇండియా టీవీ సర్వేలో వెల్లడి
ఇండియా టీవీ సర్వే దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఇక ఏపీ రాకీయాల విషయానికి వస్తే 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అధికార వైసీపీ 19 స్థానాల్లోనూ, ప్రతిపక్ష టీడీపీ 6 చోట్ల గెలుస్తోందని సర్వే పేర్కొంది. ఏపీలో తిరిగి అధికారంలోకి రావడమే కాకుండా 175 స్థానాల్లో గెలవాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు టార్గెట్ చేసి ప్రజల్లోకి పంపిస్తుంటే.. 2014లో గెలిచినట్టుగా మరోమారు ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని టీడీపీ తపిస్తోంది. మొత్తంగా ఏపీలో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయనుకుంటున్న తరుణంలో వార్ వన్ సైడ్ అంటూ ఇండియా టీవీ సర్వే స్పష్టం చేస్తోంది.